గత ఏడాది బాగా హడావుడి చేసిన బ్యూటీ కావ్య థాపర్ సడెన్లీ ఈ ఏడాది సైలెంట్ అయ్యింది. ప్లాప్స్ ఆమె కెరీర్ పై గట్టి దెబ్బే వేశాయి. స్టార్ హీరోలతో జోడీ కట్టినప్పటికీ ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. ఈ మాయ ప్రేమేమిటోతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కావ్య బేబీ ఈ ఏడేళ్లలో పది సినిమాలు కూడా చేయలేకపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లోకి స్టెప్ ఇన్ అయినా పెద్దగా కలిసి వచ్చిందీ ఏమీ లేదు భామకు. దీంతో టాలీవుడ్‌నే నమ్ముకుంది బ్యూటీ.
Also Read : Manchu Family Issue : మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా
ఏక్ మిని కథ, పిచ్చైకారన్ చిత్రాల్లో మంచి ఫెర్ఫామెన్స్ చూపించడంతో టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించే ఛాన్సులు కొల్లగొట్టింది కావ్య. అప్పటి వరకు ఏడాదికి ఒక్క మూవీ చేసుకుంటూ వచ్చిన భామ లాస్ట్ ఇయర్ నాలుగు సినిమాలతో పలకరించింది. రవితేజ ఈగల్, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన, రామ్ డబుల్ ఇస్మార్ట్, గోపీచంద్ విశ్వమ్‌లో గ్లామరస్ రోల్‌లో కనిపించింది కానీ ఊరు పేరు బైరవ కోన మినహా మిగిలివన్నీ డిజాస్టర్లు. ఈ హ్యాట్రిక్ ప్లాప్స్ ఆమె కెరీర్‌పై గట్టి దెబ్బేశాయి. పేలవమైన స్క్రిప్ట్స్ కావ్యను ఫేడవుటుకు దగ్గర చేశాయి. విశ్వం తర్వాత కాస్త గ్యాప్ తీసుకునేందుకు వెకేషన్స్‌కు వెళ్లిన కావ్య థాపర్ మళ్లీ కెరియర్ పై ఫోకస్ చేస్తోంది. ఓ సినిమాకు కమిటైనట్లు టాక్. ధమాకా దర్శకుడు త్రినాథ రావు నక్కిన అప్ కమింగ్ ప్రాజెక్టులో ఓకే అయినట్లు టీఎఫ్ఐలో బజ్ నడుస్తోంది. హవీష్ హీరోగా తెరకెక్కుతోన్న ఈసినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లినట్లు సమాచారం. ఈ సినిమా అయినా కావ్యకు హిట్ ఇస్తుందో లేదో.