Bandi Sanjay: హైడ్రా పై విశ్వాసం పోతుంది.. నేను మొదట హైడ్రాకి సపోర్ట్ చేశానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హైడ్రాతో డైవర్ట్ చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా తో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల ను కొట్టాలి. పేదలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. పేదల ఇళ్లను కూలుస్తున్నారు సామాన్యులను ఇబ్బందులు పెడితే ఊరుకోమన్నారు. హైడ్రా ను ఒక్కపుడు స్వాగతించాం.. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చాయన్నారు.
Read also: Malla Reddy: నేను పార్టీ మారలేదు.. సమయం వచ్చినప్పుడు చెబుతా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ఎక్కువగా సభ్యత్వం చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే వారికే టికెట్ పైరవీలు నా దగ్గర నడవదని తెలిపారు. ఇచ్చిన మాట తప్పకుండ నిలబెట్టుకుంటా అన్నారు. కాంగ్రెస్ పై ప్రజల్లో విరక్తి స్టార్ట్ అయ్యిందని తెలిపారు. బీఆర్ అవుట్ డేటెడ్ పార్టీ అన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం కేసీఆర్ యాగాలు చేయాలన్నారు. బిడ్డ జైలు నుంచి బయటకు రాగానే యాగం చేస్తున్నాడని విమర్శించారు. రీ ఎంట్రీ కాదు …పాలిటిక్స్ లో నో ఎంట్రి బోర్డు రాసి పెట్టారన్నారు.
Telangana: నేడు తెలంగాణ భాష దినోత్సవం..