బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా త్వరలో చట్టబద్ధత తెస్తామన్నారు సీఎం చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటాం అన్నారు..