CM Chandrababu: స్వచ్చాంధ్ర, స్వచ్ దివాన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోగా.. ఈ నెలలో సోర్స్ రీ సోర్స్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోవాలన్నారు. మన మూలాలు - మన బలాలు తెలుసుకునేలా.. రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు.
బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా త్వరలో చట్టబద్ధత తెస్తామన్నారు సీఎం చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటాం అన్నారు..
Minister Savita: అమరావతిలో బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీడ్ పథకం అమలు చేస్తున్నామన్నామని తెలిపారు.