AP Revenue Deficit: రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. కానీ.. ఏపీలో మాత్రం రెవెన్యూ లోటు అంతకంతకూ పెరుగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. రాష్ట్రానికి వచ్చే రాబడి కన్నా ఖర్చులు ఎక్కువయ్యాయి. 2025-26లో 33వేల 185 కోట్లు రెవెన్యు లోటు ఉంటుందని అంచనా. కానీ.. ఆరు నెలలకే 46వేల 652 కోట్లకు చేరింది. అంచనాలకు తగినట్లు రాబడులు పెరగడం లేదు.. అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వం…
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,51,162 కోట్లు రెవెన్యూ వ్యయంగా ప్రకటించింది. మూలధన వ్యయం రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా…
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్‌ను రూపొందించింది. ఈ బడ్జెట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి పయ్యావుల అసెంబ్లీలో, మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నేడు ఉదయం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
AP Cabinet: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2025-26వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయంపై కసరత్తు చేస్తోంది.. త్వరలో రాష్ట్ర బడ్జెట్ 2025-26 కూడా ఉండడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆదాయార్జన వాఖలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.