కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్లు కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచన చేశారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్ధ వినియోగం.. ఈ 3 అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా... 3 పంటలు నిరంతరం పండించేలా చూడాలన్నారు.
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వస్తున్న వరద నీటిని వినియోగించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తిగా నీటితో నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జల వనరులు శాఖ అధికారులను ఆదేశించారు.