Air Conditioners: ఎండలు దంచికొడుతున్నాయి.. అప్పుడప్పుడు అకాల వర్షాలతో కొంత వరకు వాతావరణం చల్లబడుతున్నా.. మళ్లీ ఎండలు మండిపోతున్నాయి.. దీంతో, ప్రజలు ఫ్యాన్ కింద సేదతీరే పరిస్థితి లేకుపోవడంతో.. కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.. అయితే, ఏసీ ఉంది కదా? అని హై కూల్.. 18 డిగ్రీలు, 20 డిగ్రీలు వాడేశారంటే తప్పులే కాలేసినట్టే.. ఎండ నుంచి వచ్చి రాగానే ఏసీలు తక్కువ డిగ్రీల్లో వాడినా సమస్యలు తప్పవు.. మరోవైపు.. కరంట్ బిల్లు వాచిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.. మరి.. ఏసీలు ఎలా వాడాలి..? ఎన్ని డిగ్రీల వరకు ఏసీ వేసుకుని వాడితే మంచిదో కీలక సూచనలు చేసింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)..
Read Also: Osaka Expo 2025: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!
ఇళ్లతో పాటు, కార్యాలయలు, వాణిజ్య సముదాయాల్లో ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది అని వెల్లడించింది బీఈఈ.. ఏసీలను 24 డిగ్రీల వద్ద వాడితే 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పేర్కొంది.. ఇలా చేస్తే సంవత్సరంలో దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని.. దాని ద్వారా రూ.10 వేల కోట్లు మిగిల్చినట్లు అవుతుందంటూ ఓ ప్రకటనలో వెల్లడించింది బీఈఈ.. అయితే, సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల దగ్గర ఏసీలను వినియోగిస్తున్నారని.. దీంతో విద్యుత్ భారం అదనంగా పడుతుందని తెలిపింది.. ఇక, హోటళ్లు, ఎయిర్‌పోర్ట్‌లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు, వాణిజ్య సముదాయాల్లో ఏసీలను వినియోగించేప్పుడు 24 డిగ్రీలు పెడితే.. తద్వారా కర్బన ఉద్ఘారాల విడుదల తగ్గుతుందని.. దీంతో, ఏసీల జీవితకాలం కూడా పెరుగుతుందని కూడా పేర్కొంది.. ఈ విషయంలో విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వ ఏజెన్సీలకు సూచించినట్టు పేర్కొంది బీఈఈ..