పాఠశాలల్లో పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీబీఎస్‌ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గత నిబంధనను సవరిస్తూ తన పరిధిలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు సీబీఎస్‌ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా లేఖ రాశారు.
గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్‌లో సీసీ టీవీ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్‌లోని బాత్రూం వద్ద సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాత్రి వేళల్లో హాస్టల్ కి బయట వ్యక్తులు వస్తున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పనితీరుపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది..
Inter Board : తెలంగాణలో ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి.…
ఒక వ్యక్తి రక్షణ కోసం తన ఇంట్లో.. బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఎవరైనా దొంగలు పడినా.. లేదంటే అజ్ఞాత వ్యక్తులు వచ్చినా కనిపెట్టడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. సీసీ కెమెరాలు పెట్టింది ఒక ఉద్దేశంతో పెడితే.. అందులో రికార్డైన దృశ్యాలు చూసి అవాక్కయ్యాడు.
ఇటీవల మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణె నగరంలో పోర్షే కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో ఓ మైనర్ ను నిందితుడిగా చేర్చారు. ఈ కేసు ఇంకా సాల్వ్ కాకముందే, ఇప్పుడు మరోసారి గుండెను కదిలించే ప్రమాదానికి సంబంధించిన వీడియో పూణే నుండి బయటకు వచ్చింది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు అతనిని ఢీకొట్టింది. మే 27న తెల్లవారుజామున 1.30 గంటలకు పింప్రి చించ్‌వాడ్ లోని వాకాడ్…
పోలీసు స్టేషన్‌లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను నెల రోజుల్లోగా పాటించాలని సూచించింది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భద్రతా చర్యలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమీక్షించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలలో వాడుతున్న సీసీ కెమెరాల సంఖ్యను కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) వెల్లడించింది. 2021, జనవరి 1వ తేదీ నాటికి దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2,82,558 సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలిపింది. అయితే పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సీసీ కెమెరాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు బీపీఆర్డీ పేర్కొంది. ఏపీలో కేవలం 20,968 సీసీ…