ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది.. అందులో భాగంగా గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, గీత కార్మికులకు 335 మద్యం షాపులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది.. జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి షాపులకు అప్లికేషన్లు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది..
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. మద్యంపై రెండు శాతం సెస్ విధించింది. మద్యం ల్యాండెడ్ రేట్లపై సెస్ విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది. సెస్ ద్వారా సుమారు రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు ముగిసింది. ఐదేళ్లుగా ప్రభుత్వం నడుపుతున్న మద్యం దుకాణాలకు నేడే చివరి వర్కింగ్ డే. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త మద్యంపాలసీలో భాగంగా.. ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ షాపులను ఇచ్చే విధంగా టెండర్లను ఆహ్వానించింది 26 జిల్లాల నుంచి 3396 షాపులకి 89,882 దరఖాస్తులు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ద్వారా స్వీకరించింది. అయితే.. నేటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి సుమారు 85 వేలకి పైగా దరఖాస్తులు వచ్చాయి