ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది.. అందులో భాగంగా గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, గీత కార్మికులకు 335 మద్యం షాపులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది.. జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి షాపులకు అప్లికేషన్లు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది..