EAGLE: డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ఈగల్‌ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో కేంద్ర కార్యాలయం… 26 జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఉత్వర్వులు ఇచ్చింది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా… సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించింది. అయితే, హెడ్ ఆఫీసులో ఉద్యోగుల కాలపరిమితి మూడేళ్ల నుంచి ఐదేళ్లుగా నిర్ణయించింది. మరోవైపు.. డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టును కోరింది ప్రభుత్వం..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్)ను ఏర్పాటు చేయనున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ బుధవారం జరిగిన సమావేశంలో నిర్ణయించిన విషయం విదితమే.. ఇక, ఈగల్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. EAGLE ఏర్పాటు నిర్ధారిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది.. 26 జిల్లాలలో 26 నార్కోటిక్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.. EAGLE హెడ్ ఆఫీసులో ఉద్యోగుల కాలం 3 నుంచి 5 సంవత్సరాలుగా నిర్ణయం తీసుకుంది.. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టును కోరారు ఏపీ డీజీపీ.. 2024-25 సంవత్సరానికి గాను EAGLE లో పని చేసే వారికి జీతభత్యాల నిమిత్తం 8.59 కోట్లు కేటాయించారు.. మిగిలిన ఖర్చులకు తదుపరి బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు.. నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారి వ్యవహరించనున్నారు.. డిప్యూటేషన్ లో అధికారులను నియమించుకోవాలని హోంశాఖ మార్గదర్శకాలు చెబుతున్నాయి..
Read Also: RGV Tweets: కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్.. 22 పాయింట్లతో..
ఈగల్ హెడ్ ఆఫీస్, నార్కోటిక్ పోలీస్ స్టేషన్, జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సెల్ లో పని చేసే వారికి విధి నిర్వహణ కాలంలో 30 శాతం స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.. ఒక్క అమరావతి హెడ్ ఆఫీస్ లోనే 249 మందితో పకడ్బందీ నిఘా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు.. ఒక్కో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ లో 66 మంది సిబ్బంది డిప్యుటేషన్ లో విధులు నిర్వహిస్తారు.. జిల్లాలవారీగా నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ లో విధులు నిర్వహించనున్నారు 144 మంది ఉద్యోగులు.. మొత్తం 358 మంది అధికారులతో ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా కలుపుకుని డ్రగ్స్ నియంత్రణ కోసం మొత్తం 459 మందితో కూడిన ఈగల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది.. అందులో డిప్యూటేషన్ పద్ధతిలో 341 మంది, రెగ్యులర్ పద్ధతిలో 17 మందికి విధులు నిర్వహిస్తారు.. పరిశోధన పర్యవేక్షణ మరియు లీగల్ వింగ్, డాక్యుమెంటేషన్ ట్రైనింగ్ మరియు అవార్నెస్ వింగ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ లాజిస్టిక్స్ వింగ్, టెక్నికల్ వింగ్, స్టేట్ టాస్క్ ఫోర్స్ ల వంటి 5 కీలక విభాగాల ఏర్పాటుకు మార్గదర్శకాలు ఇచ్చింది ప్రభుత్వం.. 1972 టోల్ ఫ్రీ నంబర్ నిర్వహణ కోసం సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో 12 మంది కాల్ టేకర్లను నియమించనున్నారు..