Nubia Fold, Nubia Flip3: ZTE సంస్థకు చెందిన నుబియా తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను పెంచుతూ కొత్తగా nubia Fold, nubia Flip3 మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. అధునాతన డిస్‌ప్లేలు, కొత్త తరం ప్రాసెసర్లు, AI ఫీచర్లు, మెరుగైన డిజైన్‌తో ఈ రెండు ఫోన్లు ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో రానున్నాయి. ఇక nubia Fold ఒక మెగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా 8 అంగుళాల OLED ప్రధాన డిస్‌ప్లేతో పాటు 6.5 అంగుళాల కవర్ స్క్రీన్‌ను అందిస్తుంది. ఈ మొబైల్ ఫోల్డ్ చేసినప్పుడు 11.1mm మందం ఉంటుంది. అలాగే IPX4 వాటర్ రెసిస్టెన్స్, IP5X డస్ట్ ప్రొటెక్షన్ సహాయంతో ఇది రోజువారీ వినియోగానికి బలంగా తయారైంది.
ఇందులో Snapdragon 8 Elite చిప్‌తో 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ కాంబినేషన్ తో మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి అన్ని టాస్క్‌లను అత్యంత స్మూత్‌గా నిర్వహిస్తుంది. అలాగే ఇందులో 6,560mAh పెద్ద బ్యాటరీ 55W ఫాస్ట్ చార్జింగ్‌తో కలిసి వచ్చే ఈ డివైస్ రోజంతా పవర్‌ను అందించేందుకు సరిగ్గా సరిపోతుంది. ఇక కెమెరా సెటప్‌లో 50MP వైడ్, 50MP అల్ట్రా వైడ్ మరియు 5MP మాక్రో కలిపి ట్రిపుల్ రియర్ కెమెరా ఏర్పాటు ఉంది. ముందు భాగంలో 20MP ప్రధాన సెల్ఫీ కెమెరా, 20MP కవర్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. నైట్ ఫోటోగ్రఫీ, పోర్ట్రెయిట్స్, గ్రూప్ షాట్స్ అన్ని కలిపి మరింత మంచి ఫలితాలు ఇస్తాయి.
Mamata Banerjee: బాబ్రీ మసీదు ప్రతిపాదన తెచ్చిన ఎమ్మెల్యేపై మమత ఆగ్రహం!
AI అనుభవం nubia Foldలో ప్రత్యేక ఆకర్షణ. పవర్ బటన్‌ను 0.5 సెకన్ల పాటు నొక్కితే AI కాల్ అసిస్ట్, AI ట్రాన్స్‌లేషన్, AI రైటింగ్, ప్రైవసీ మాస్కింగ్, ఎరేజర్ మేజిక్, AI గేమింగ్ స్పేస్ వంటి ఫీచర్లు యాక్టివేట్ అవుతాయి. ఇంకా FeliCa సపోర్ట్‌తో టచ్ పేమెంట్‌లు కూడా చేయవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ 5G, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
ఇక మరోవైపు nubia Flip3 ఒక తేలికైన, స్టైలిష్ క్లామ్‌షెల్ ఫ్లిప్ ఫోన్‌గా డ్యూయల్ OLED డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. ఇది 6.9 అంగుళాల ప్రధాన OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే 4 అంగుళాల సబ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది కేవలం 187 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. దీర్ఘకాలిక వినియోగానికి 3వ తరం స్ట్రాంగ్ హింజ్ ఏర్పాటు చేయబడింది. దీనివల్ల ఇది 300,000 ఓపెన్ అండ్ క్లోజ్ సైకిల్స్‌ను భరించగలదు.
పర్ఫార్మెన్స్ పరంగా.. MediaTek Dimensity 7400X చిప్‌సెట్‌తో పాటు 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ రోజువారీ పనులు, సోషల్ మీడియా, లైట్ గేమింగ్ వంటి కార్యకలాపాలను స్మూత్‌గా నిర్వహిస్తుంది. ఇందులో 4,610mAh బ్యాటరీ ఉండగా.. కెమెరా సెటప్‌లో 50MP వైడ్, 12MP అల్ట్రా వైడ్ రియర్ కెమెరాలు, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. జెష్చర్ కంట్రోల్స్ సహాయంతో స్క్రీన్‌ను తాకకుండా ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే Neovision AI Camera ఆటో ట్రాకింగ్, జూమ్, కలర్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లతో ఫోటోగ్రఫీని మరింత మెరుగుపరుస్తుంది.
ప్రాణాలు కాపాడే ఫీచర్.. Apple Watchలో ఇకపై హైపర్‌టెన్షన్ (బీపీ) హెచ్చరికలు..!
ఫోన్‌లో AI కాల్ అసిస్ట్, Simultaneous ఇంటర్ప్రెటేషన్, AI ఫ్రాడ్ ప్రివెన్షన్, సర్కిల్ అండ్ సెర్చ్, ఎరేజర్ మేజిక్, FeliCa ఆధారిత టచ్ పేమెంట్స్ వంటి AI ఆధారిత సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే ఈ మొబైల్ 5G, Wi-Fi 6, బ్లూటూత్ 6.0, NFC వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే nubia Fold జపాన్‌లో JPY 178,560 ధరతో విడుదల కాగా.. 2026లో గ్లోబల్ లాంచ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక nubia Flip3 ధర, లభ్యత వివరాలను సంస్థ త్వరలో ప్రకటించనుంది.