ప్రాణాలు కాపాడే ఫీచర్.. Apple Watchలో ఇకపై హైపర్‌టెన్షన్ (బీపీ) హెచ్చరికలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Watch: ఆపిల్ (Apple) సంస్థ కొత్తగా watchOS 26 అప్‌డేట్‌తో వచ్చిన హైపర్‌టెన్షన్ (Hypertension) నోటిఫికెషన్స్ ఫీచర్‌ను భారత్ సహా మరిన్ని దేశాలకు తీసుకవచ్చింది. ఈ కొత్త స్మార్ట్ ఆరోగ్య ఫీచర్ ఆపిల్ వాచ్ సేకరించే హార్ట్ డేటాను 30 రోజుల పాటు విశ్లేషించి.. వాచ్ వాడే వ్యక్తి రక్తపోటు ఎక్కువగా ఉన్న సంకేతాలు నిరంతరంగా కనిపిస్తే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో హెచ్చరిస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే Apple Watch Series 9 లేదా Ultra 2 లేదా ఆపై మోడల్, కొత్త watchOS 26, అలాగే iPhone 11 లేదా ఆపై మోడల్ iOS 26 తో ఉండాలి. ఇందులో ‘రిస్ట్ డిటెక్షన్’ ఆన్‌గా ఉండాలి. అలాగే మనిషి వయస్సు 22 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే గర్భిణీ కాకుండా ఉండాలి. ఇంకా హైపర్‌టెన్షన్ డయాగ్నోస్ చేయబడిన వారు ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి అర్హులు కాదు.
ప్రపంచంలోనే మొదటి Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో OnePlus Ace 6T లాంచ్..!
Also Read
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
ఈ సెటప్ కోసం ఐఫోన్ లో హెల్త్ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్‌ద్వారా Health Checklist లో Hypertension Notificationsను ఎంచుకుని.. వయస్సు, హెల్త్ హిస్టరీ కన్ఫర్మ్ చేసి సూచనలను అనుసరించాలి. సెటప్ పూర్తయిన తర్వాత.. గత 30 రోజుల హార్ట్ డేటాలో హైపర్‌టెన్షన్ సూచనలను కనిపిస్తే ఆపిల్ వాచ్ నోటిఫికేషన్ ఇస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వినియోగదారులు వైద్య నిపుణుల ద్వారా రక్తపోటును చెక్ చేయించాలి. వీటితోపాటు Blood Pressure Logను సెటప్ చేసి.. థర్డ్-పార్టీ బీపీ కఫ్ సహాయంతో 7 రోజుల పాటు రక్తపోటు రీడింగ్స్‌ను రికార్డ్ చేయాలని ఆపిల్ సూచిస్తోంది. Apple Watchలోని ఆప్టికల్ సెన్సార్ రక్తనాళాలు హార్ట్‌బీట్‌కు ఎలా స్పందిస్తున్నాయో విశ్లేషించి, ఆల్గోరిథమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం డేటాను పరిశీలిస్తుంది. నిరంతర హైపర్‌టెన్షన్‌కు సంబంధించిన సంకేతాలు ఉంటే వినియోగదారులకు ముందస్తుగా అలర్ట్ పంపబడుతుంది. అయితే ఆపిల్ సంస్థ ఈ ఫీచర్ డయాగ్నోస్ చేయడానికి, చికిత్స చేయడానికి లేదా మందుల నిర్వహణకు ఉద్దేశించబడలేదని స్పష్టంగా తెలిపింది.
EPFO 3.O: ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి ఏటీఎమ్ నుంచి ఫీఎఫ్..
วันนี้ Apple Watch เปิดตัวคุณสมบัติการแจ้งเตือนภาวะความดันโลหิตสูง (hypertension notifications) ในประเทศไทย
ซึ่งสามารถแจ้งเตือนผู้ใช้หากตรวจพบสัญญาณของภาวะความดันโลหิตสูงเรื้อรัง หรือ ภาวะความดันโลหิตสูง (hypertension) pic.twitter.com/B0uI4MNpnF
— Apple Archive 𝕏 (@AppleArchiveth) December 4, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!