BJP MP Konda Vishweshwar Reddy: లోక్‌సభ జీరో హవర్‌లో బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కోతుల సమస్యలను లేవనెత్తారు. కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారని తెలిపారు.. కోతుల సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని కోరారు. కోతుల సమస్య తమ శాఖ కిందికి రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని. కోతుల సమస్య ఏ శాఖ కిందికి వస్తుందో వెల్లడించాలని ప్రశ్నించారు. ఈ విషయం చాలా చిన్నది అనిపిస్తుంది అందరూ నవ్వుతారు.. కోతుల సమస్య చిన్నగా అనిపిస్తుంది, కానీ పెద్ద సమస్య.. తెలంగాణ మాత్రమే కాదు, దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్య ఉంది.. కోతుల విషయంలో నోడల్ ఏజెన్సీ అవసరం.. సర్పంచి ఎన్నికల్లో కూడా కోతుల సమస్య ఒక ఎజెండా మారింది.. కోతుల సమస్య పరిష్కరిస్తే సర్పంచిగా గెలిపిస్తాం అంటున్నారు జనం. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కోతుల సమస్య తీవ్రంగా ఉందని ఎంపీ తెలిపారు.. ఈ అంశంపై కేంద్ర నుంచి సమాధానం రావాల్సి ఉంది..
READ MORE: Mamata Banerjee: ఎన్నికల సమయంలో మమత యాక్షన్.. ముస్లిం ఎమ్మెల్యే సస్పెండ్
వాస్తవానికి.. తెలంగాణ రాష్ట్రంలో కోతుల సమస్య అధికంగా ఉంది. సవాళ్లను అధిగమించి పంట సాగు చేసిన రైతులను అడవి జంతువులు కలవర పెడుతున్నాయి. వనాల సరిహద్దులోని పంట పొలాలపై వరుస దాడులకు దిగుతున్నాయి. అన్నదాతల ఆరుగాలం కష్టాన్ని ఒక్క రాత్రిలోనే తుడిచిపెడుతున్నాయి. ఫలితంగా కర్షకులు రేయింబవళ్లు వ్యవసాయ క్షేత్రాల్లో కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో తెలంగాణ నలుమూలలా అనేక గ్రామాలు, పట్టణాలు కోతుల జనాభాలో నాటకీయ పెరుగుదలను చూస్తున్నాం. కోతి అంటే దైవత్వం, సంస్కృతికి చిహ్నం. అయితే ఈ దశ ఇప్పుడు నిరాశ, ఆర్థిక నష్టానికి ప్రధాన కారణంగా మారింది. పెరుగుతున్న కోతుల జనాభా వాణిజ్య పంటలకు, ముఖ్యంగా మామిడి తోటలు, కూరగాయలు, పండ్ల తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పంట నష్టంతోపాటు, కోతులను అడ్డుకుంటున్నవారిపై దాడి చేసి గాయపరచడం ప్రారంభించాయి. కోతుల బెడద ఒక విసుగుగా ప్రారంభమై ఇప్పుడు తీవ్రమైన గ్రామీణ సంక్షోభంగా మారింది.
కోతుల వల్ల రైతులే ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. కోతులు దళాలుగా పంట పొలాలపై దాడి చేసి నిమిషాల్లోనే పంటలను నాశనం చేస్తాయి. మామిడి తోటలు, కొబ్బరి చెట్లు, మొక్కజొన్న పంటలు, కూరగాయలు కూడా పంటకోతకు ముందే నాశనమవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, శ్రమ కోర్చి వేల రూపాయలు పెట్టుబడి పెట్టే రైతు, కోతుల బెడద కారణంగా నిమిషాల్లో పంటను కోల్పోతాడు. కొన్ని గ్రామాల్లో ప్రజలు తమ పొలాలను కాపాడుకోవడానికి వాచ్‌మెన్‌లను నియమించుకోవలసి వస్తుంది లేదా రాత్రిపూట మేల్కొని ఉండవలసి వస్తుంది. ఈ ప్రక్రియతో రైతు శాంతి, జీవనోపాధి రెండింటినీ కోల్పోతున్నాడు. ఈ సమస్య కేవలం వ్యవసాయానికే పరిమితం కాదు. కోతులు ఆహారం కోసం ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. తమను తాము రక్షించుకోలేని వృద్ధులపై కూడా దాడి చేస్తాయి. అనేక గ్రామాల్లో, ప్రజలు ఇప్పుడు చేతిలో కర్రలతో నడుస్తున్నారు. అది ఫ్యాషన్ కోసం కాదు, తమ రక్షణ కోసం! అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.