మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కోసం అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. విద్యాసంస్థల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.. ఒక్కో క్లబ్ లో టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు కలిపి సభ్యులుగా మొత్తం 10 మంది ఉండేలా చూసుకోవాలని సూచించింది..
డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ఈగల్‌ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో కేంద్ర కార్యాలయం... 26 జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఉత్వర్వులు ఇచ్చింది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా... సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించింది. అయితే, హెడ్ ఆఫీసులో ఉద్యోగుల కాలపరిమితి మూడేళ్ల నుంచి ఐదేళ్లుగా నిర్ణయించింది. మరోవైపు.. డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ,…