Quantum Valley Declaration: అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత నెల 30వ తేదీన విజయవాడలో జరిగిన ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్ నిర్వహించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలిసి కొత్త టెక్నాలజీని సమన్వయంతో పనిచేసే దిశగా చర్చలు తీసుకోవాలని తెలిపింది ప్రభుత్వం. అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో “అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్” ను జూన్ 30 ప్రకటించింది ప్రభుత్వం. ఈ డిక్లరేషన్‌పై ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఉత్తర్వుల ద్వారా క్వాంటం పరిశోధన, ఆవిష్కరణ, ప్రతిభ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనునట్టు తెలిపింది ప్రభుత్వం..
Read Also: Suicide : “నీ కొడుకు తలరాత ఇలానే రాస్తావా.?” సూసైడ్ నోట్‌లో దేవుడిపై యువకుడు
దేశంలోపే అతి పెద్ద క్వాంటమ్ వ్యాలీ బెడ్‌గా క్వూ -చిప్- ఇన్ ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపిం ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి లక్ష్యంగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. 2026లో ప్రారంభం అయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ , ఫెలోషిప్ లు అందజేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..