Cyclone Montha: మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. కీలక ఆదేశాలు జారీ చే శారు.. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి, నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇంఛార్జ్‌లను నియమించాలి.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ చేయాలి..…
ఎవరైనా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు.. అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు చంద్రబాబు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..
HMPVపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ టెలీ కాన్ఫెరెన్స్‌లో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. HMPVకు సంబంధించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేశారనే వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు..
వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించారు.. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు అయినట్టు వెల్లడించారు..