Mahesh Babu : సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలను పోషించి మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు సోనూసూద్. ఆయన కరోనా సమయంలో చేసిన మంచి పనులతో అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నారు. ఆ తర్వాత ఆయన హీరోగా కూడా సినిమాలు వచ్చాయి. నటుడిగా బిజీగా ఉన్న సోనూసూద్ దర్శకుడిగా మారి ‘ఫతేహ్’ అనే సినిమాను తెరకెక్కించారు. దర్శకత్వంతో పాటు తానే హీరోగా నటించాడు. తాజాగా ఫతేహ్ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. జనవరి 10న విడుదల కాబోతున్న ఫతేహ్ సినిమా అంచనాలను పెంచే విధంగా ఉంది.
An action-packed spectacle that looks absolutely amazing! Wishing all the very best to my dear friend @SonuSood Can’t wait for everyone to witness this magic on screen! 😊 #Fateh https://t.co/d9CZlhWnnk
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2025
మహేష్ బాబు ఎక్స్ ద్వారా ట్రైలర్‌ను షేర్ చేయడంతో పాటు సోనూ సూద్‌కి ఆల్ ది బెస్ట్ తెలియజేశాడు. యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ఈ ట్రైలర్ చూడడానికి బాగుంది. నా ప్రియమైన స్నేహితుడు సోనూసూద్‌కి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు ట్వీట్‌కి సోనూ సూద్ స్పందించాడు. లవ్ యూ బ్రదర్. మనం ఇద్దరం మళ్లీ కలిసి నటించే సమయం కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన దూకుడు సినిమా ఎంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుందో తెలిసిందే. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో సోనూ సూద్ జోరు తగ్గింది.