CM Chandrababu Serious Warning: మంత్రులకు సీఎం సీరియస్ వార్నింగ్.. కీలక సమాచారం ఎలా లీక్ అయ్యింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Serious Warning: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.. దాదాపు 3 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. కేంద్రానికి, ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడంతో పాటు.. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్.. అయితే, ఎజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత.. మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం చంద్రబాబు.. కీలక సమాచారం లీక్ అవుతున్న అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ అజెండాతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ముందుగానే బయటకు ఎలా వస్తున్నాయంటూ మంత్రులను ప్రశ్నించారు. ఇకపై క్యాబినెట్ సమావేశానికి ముందే ఎజెండా లీకైతే సంబంధిత మంత్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టంగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. గతంలో ఇలాంటి లీకుల కారణంగా ఎన్టీఆర్ తన కేబినెట్‌ను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
అదేవిధంగా, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా సీఎం మంత్రులకు పలు సూచనలు చేశారు. ‘జలధార’ పథకం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. పాస్‌బుక్స్ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు, సంబంధిత మంత్రులు నెలకు కనీసం నాలుగు సార్లు ప్రాంతాల వారీగా పర్యటించాలని ఆదేశించారు. ‘సూర్య ఘర్’ పథకంపై మరింత దృష్టి పెట్టాలని, వచ్చే ఏడాదితో ముగియనున్న లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని మంత్రులకు నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే మహిళా బిల్లుపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. ఇక, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తంగా, ఏపీ కేబినెట్‌లో లీకుల అంశంపై సీఎం చంద్రబాబు గట్టి హెచ్చరిక జారీ చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాల అమలుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!