HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..
- పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియుడు
- ఇంట్లో ఉరి వేసుకుని రమణి ఆత్మహత్య
- ప్రియుడు మనోహర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించాడు ప్రియుడు. గత నెల (మార్చి) 11న పెళ్లికి నిరాకరించిన రమణి కి ఇంజక్షన్ ద్వారా ఎయిడ్స్ ఉన్న రక్తం ఎక్కించాడు ప్రియుడు మనోహర్. దీంతో అవమాన భారంతో అన్నోజిగూడ రాజీవ్ గృహ కల్పలో ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని రమణి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడు మనోహర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. పెళ్లికి నిరాకరించినందుకు రమణికి ఇంట్లో చొరబడి ఇంజక్షన్ ఎక్కించిన మనోహర్.. రమణి నీ బెదిరించి బలవంతంగా ఎయిడ్స్ తో కూడిన ఇంజక్షన్ ఎక్కించాడు.. ఇప్పటికే ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాడు మనోహర్..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌లో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి ఎదులాబాద్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆమెకు కుటుంబ సభ్యుల పరిచయంతో మనోహర్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇద్దరు కూడా సమీప బంధువులవుతారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వైద్య పరీక్షల్లో మనోహర్‌కు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పెళ్లికి నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని మనోహర్ అంగీకరించలేకపోయాడు.
మార్చి 11న అన్నోజిగూడ ప్రాంతంలో ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు మనోహర్. తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురయ్యాడు. కానీ అంతకు ముందే కంత్రీ ప్లాన్ వేసుకుని వచ్చాడు. ముందే రెడీ చేసుకున్న ప్లాన్ ప్రకారం.. యువతికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న రక్తం ఎక్కించి పారిపోయాడు. ఈ ఘటన అనంతరం యువతికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుపోయారు. ఐతే పదేపదే జ్వరం ఎందుకు వస్తుందని యవతిని డాక్టర్లు అడిగారు. దీంతో డాక్టర్ల ఒత్తిడితో మనోహర్ సిరంజి ద్వారా హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించినట్లు తెలిపింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read:Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు యువతి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. గతంలోని మనోహర్ తండ్రి హెచ్ఐవి సోకి మరణించాడు. తల్లికి కూడా హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉన్న నేపథ్యంలో తనతో పెళ్లికి నిరాకరించిందని భావించిన మనోహర్.. ఆమెకు కూడా హెచ్ఐవీ ఉంటే తనను పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ సంఘటన సమాజంలో హెచ్ఐవి వంటి వ్యాధులపై అవగాహన ఎంత అవసరమో మాత్రమే కాకుండా, సంబంధాలలో నిజాయితీ లేకపోతే అది ఎంత పెద్ద విషాదానికి దారి తీస్తుందో చూపించింది. ప్రేమ, పెళ్లి వంటి బంధాలు పరస్పర గౌరవం, బాధ్యతలపై నిలబడాలి గానీ ప్రతీకారం, కోపంతో తీసుకునే నిర్ణయాలు అమాయకుల జీవితాలను నాశనం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?