ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం… 2027 వరల్డ్ కప్‌లో అసలు ఏం జరగబోతోంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందని, వారికేం వయసు అయిపోలేదని పాకిస్తాన్ బ్యాటింగ్ దిగ్గజం జహీర్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది (2027) దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరూ ఖచ్చితంగా ఆడాలని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్, కోహ్లీ శైలికి సాటి లేదని, వారిద్దరూ పూర్తి ఫిట్నెస్తో రన్స్ చేస్తున్నప్పుడు కేవలం వయసును కారణం చూపి ప్రపంచకప్ జట్టు నుంచి పక్కన పెట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లాండ్‌లో రోహిత్ కొట్టిన సెంచరీ అద్భుతమని, ఆయన బ్యాటింగ్ టైమింగ్ చూడటం ఒక అనుభూతి అని కొనియాడారు. ఇదే సమయంలో బాబర్ ఆజం పునరాగమనంతో పాకిస్తాన్ క్రికెట్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరొకవైపు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా రోహిత్-కోహ్లీల భవిష్యత్తుపై టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లకు స్పష్టత ఉండాలని కోరారు. ఒకవేళ ఆ ఇద్దరినీ 2027 ప్రపంచకప్‌లో ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తే, వారి భుజం తట్టి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని సూచించారు. “మళ్లీ ఫామ్ కోల్పోతే జట్టులో ఉంటామా లేదా అనే ఒత్తిడి లేకుండా వారిని స్వేచ్ఛగా ఆడనివ్వాలి. గతంలో నేను కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను, అందుకే వారి మానసిక స్థితి నాకు తెలుసు” అని యువీ పేర్కొన్నారు.
Also Read
- Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
2027 వన్డే ప్రపంచకప్ సమయానికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు, విరాట్ కోహ్లీకి 39 ఏళ్లు వస్తాయి. అయితే ఈ మధ్య రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నారంటూ వచ్చిన వార్తలను బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఈ ఇద్దరి అనుభవం భారత జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
-
Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!