Heavy Rain Alert: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Alert: ఉత్తర ఒడిశా భూ ఉపరితలంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తీరం దాటిన తర్వాత ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. ఐఎండీ అంచనాల ప్రకారం, ఈరోజు అల్లూరి సీతారామరాజు (ASR), పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో బులెటిన్ జారీ చేసింది.
తెలంగాణలోనూ ఈ వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. పెద్దాపురంలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఏలూరు, పాలకోడేరు, కొమరాడ, భీమడోలు ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో సుమారు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు.. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, సాధారణ ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!