AP Assembly Session: రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి… రేపు ఉదయం 9 గంటలకు శాసన సభ… 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి… సభ ఎన్ని రోజులు జరగాలి.. అనే అంశంపై బీఏసీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభం అవుతుంది… అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది…. అసెంబ్లీ సమావేశాలు నిర్మాణకు సంబంధించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. సీఎస్, డీజీపీలతో కీలక సమీక్ష చేశారు అయ్యన్న పాత్రుడు… పోలీస్ యంత్రాంగం ఎక్కడెక్కడ ఉండాలి విధుల నిర్వహణ పై చర్చించారు… ఒక వారం రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.. కాబట్టి దానికి సంబంధించి భద్రత వ్యవహారం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు డీజీపీకి సూచించారు.
Read Also: 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేతో Oppo K13s వచ్చేసిందోచ్!
అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది.. అసెంబ్లీ సమావేశాలు.. ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అనే అంశం పై నిర్ణయం తీసుకోనున్నారు… అసెంబ్లీ కి వైసీపీ ఎమ్మెల్యే లు హాజరయ్యే పరిస్థితి లేదు.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వైసీపీ చెబుతోంది.. గతంలో మాదిరిగానే కేవలం మండలి సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు.. ఇక, అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని.. లేకపోతే ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చెయ్యాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి… స్పీకర్.. ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రావాలని చెబుతున్నారు… దీంతో రేపు ఎంతమంది హాజరు అవుతారు అనేది కూడా హాట్ టాపిక్ అయింది.
ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని కీలక ఆర్డినెన్స్ లు ప్రవేశ పెట్టనున్నారు. పంచాయితీ. రాజ్.. మున్సిపల్ చట్ట సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్ లు సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో పాటు నాలా చట్ట సవరణ.. షెడ్యూల్ సబ్ క్యాస్ట్… ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆర్డినెన్స్ లను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం… వీటిని బిల్ రూపంలో తీసుకొచ్చిన తర్వాత… చట్టం చేయనుంది ప్రభుత్వం.. రేపటి కేబినెట్ సమావేశంలో మరికొన్ని బిల్లులు ఆమోదించి… అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం..