Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..
- ‘ఆడుదాం ఆంధ్ర’లో భారీ అవకతవకలు బహిర్గతం
- 100 కోట్ల ప్రాజెక్ట్‌లో 40 కోట్ల దుర్వినియోగం?
- మాజీ మంత్రి రోజా సహా పలువురిపై విజిలెన్స్ ఫోకస్
- నివేదికతో కఠిన చర్యల దిశగా ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల్లో జరిగిన భారీ అవకతవకలపై విజిలెన్స్ విభాగం విచారణ పూర్తి చేసింది. క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట 40 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ చివరకు వంద కోట్లకు చేరడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని, ఇందులో సుమారు 40 కోట్ల రూపాయలకు పైగా ప్రజా ధనం పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించి సుమారు 3000 పేజీల భారీ నివేదికను సిద్ధం చేశారు.
Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
ఈ కుంభకోణానికి సంబంధించి సిద్ధమైన నివేదికలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా , శాప్ (SAAP) మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలు కీలక పాత్ర పోషించినట్లు విజిలెన్స్ స్పష్టంగా గుర్తించింది. వీరిద్దరితో పాటు అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్, రిటైర్డ్ ఐఏఎస్ వాణి మోహన్ , శాప్ ఐటి విభాగానికి చెందిన పలువురు అధికారుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో బాధ్యులైన నేతలు , అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండి, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు.
Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?
ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందిస్తూ, తప్పు చేయనప్పుడు మాజీ మంత్రి రోజా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల రక్తమాంసాలను పంచుకుని తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అది అధికారులైనా లేదా రాజకీయ నాయకులైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉందా లేదా అనే అంశం కూడా నివేదిక అందిన తర్వాత స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడిన రోజా , బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలకు ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. త్వరలోనే ఈ నివేదిక అధికారికంగా ప్రభుత్వానికి చేరనుండటంతో, ప్రభుత్వం తీసుకునే చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!