విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన 'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకల్లో సీఎం జగన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు-వైజాగ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు. అనంతరం విజేతలకు జగన్ స్వయంగా బహుమతుల ప్రదానం చేశారు. ఆడుదాం ఆంధ్రా టోర్నీ దాదాపు 50 రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యం.. మట్టిలోని మాణిక్యాలను గుర్తించడానికే ఆడుదాం ఆంధ్రా అని అన్నారు. 47…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. ఆడుదాం - ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అందజేయనున్నారు.. దీని కోసం పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. సాయంత్రం 5.45 గంటలకు మధురవాడ హిల్ నెంబర్ 3 కి హెలిప్యాడ్ కు చేరుకోనున్న సీఎం.. 6 గంటలకు PM పాలెం స్టేడియంలో క్రికెట్ అభిమానులను కలుసుకుని, క్రీడాకారులను అభినందనలు తెలుపుతారు..
రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి రోజా శుక్రవారం విశాఖ రైల్వే గ్రౌండ్‌లో ఆడుదాం – ఆంధ్రరాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మీకోసం, మీలో క్రీడా స్ఫూర్తి పెంచడం కోసం మన అందరి జగన్ అన్నా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను ప్రారంభించారన్నారు మంత్రి రోజా. ఆడుతాం ఆంధ్ర మీ భవిష్యత్ కు నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. మండల స్థాయి, జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయికి వచ్చారంటే…
ఈనెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పట్నం వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ముగింపు వేడుకలు విశాఖలోని ACA స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించనున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
Narayana Swamy Slams Chandra Babu Naidu: ఒకప్పుడు ఇద్దరు పీకేలను విమర్శించి.. ఇప్పుడు వాళ్లనే పక్కన పెట్టుకున్నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృధి, సంక్షేమం పాలన అందించ లేదన్నారు. చంద్రబాబుకు ఎస్సీలను చిన్నచూపు చూసే నైజం మొదటి నుంచి ఉందన్నారు. దళితులను నేటికీ గౌరవించని వ్యక్తి చంద్రబాబు అని నారాయణ స్వామి మండిపడ్డారు. నేడు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్…
‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల ద్వారా అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే లక్ష్యం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని, ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అని పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని, క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సీఎం జగన్ చెప్పారు. ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు సీఎం…
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు కలకలం సృష్టించింది. ‘పోరంబోకు భూమి కాపాడు జగనన్న’ అంటూ చల్లా అచ్చిరెడ్డి పేరుతో నల్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. నేడు సీఎం జగన్ నల్లపాడు రానున్నారు. Also Read: Top Headlines@9AM: టాప్ న్యూస్! ‘ఆడుదాం…
Adudam Andhra Program Launch Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరిగే క్రీడా సంబరంలో క్రికెట్,…