Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు, కొన్నిసార్లు మొండిగా వెళ్లినా ఫలితం మాత్రం పాత అనుభవాలనే గుర్తుచేస్తుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఫ్లాప్ సెంటిమెంట్‌ను హిట్‌గా మార్చి రికార్డులు తిరగరాయాలని ఆయన ప్రయత్నించిన ప్రతిసారీ ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ముఖ్యంగా ‘రీమిక్స్’ పాటల విషయంలో పవన్‌కు అస్సలు కలిసి రావడం లేదు. తాజాగా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొడతారని అభిమానులు ఆశించారు, ఈ సినిమాలో తన కెరీర్ లోనే క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘తొలిప్రేమ’లోని “నీ మనసే”, అనే అద్భుతమైన పాటను రీమిక్స్ చేశారు. తన సొంత పాటనే రీమిక్స్ చేసుకుంటే ఈసారైనా సెంటిమెంట్ మారుతుందేమో అనుకున్నారు కానీ, సినిమా ఫలితం చూశాక రీమిక్స్ సెంటిమెంట్ పవన్‌ను మరోసారి వెంటాడిందని స్పష్టమైంది.
Also Read :INCA: ఐఎన్సీఏ అవార్డ్స్..ఉత్తమ నటుడుగా నాగ చైతన్య!
Also Read
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీమిక్స్ పాటలు ఉన్న ప్రతిసారీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. జానీలో పాత తరం క్లాసిక్ సినిమా ‘చిట్టి చెల్లెలు’లోని “ఈ రేయి ఎంతో తియ్యనిది…” పాటను రీమిక్స్ చేశారు. పవన్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచింది. తీన్మార్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి “బస్తీ దొరసానీ…” సాంగ్‌ను రీమిక్స్ చేశారు. బాలీవుడ్ హిట్ ‘లవ్ ఆజ్ కల్’ కు రీమేక్ అయినప్పటికీ, ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సాధారణంగా పాత హీరోల పాటలను రీమిక్స్ చేయడం ఒక ఎత్తు అయితే, తన సొంత బ్లాక్ బస్టర్ సాంగ్‌ను రీమిక్స్ చేయడం మరో ఎత్తు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో “మనసే…” సాంగ్ ద్వారా ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ గట్టిగానే ప్లాన్ చేశారు కానీ, పాట ఎవరిదైనా, సినిమా ఏదైనా.. రీమిక్స్ ఉంటే అది ‘ఫ్లాప్’ అనే సెంటిమెంట్‌నే నిజం చేస్తూ ‘ఉస్తాద్’ భారీ నష్టాలను మిగిల్చింది. కలిసిరాని సెంటిమెంట్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోకి రీమిక్స్ పాటల అవసరం లేదని, ఒరిజినల్ కంటెంట్‌తో వస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!