Duronto Express: దురంతో ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది.. ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేటు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది దురంతో ఎక్స్‌ప్రెస్.. అయితే, ప్రమదానాకి కారణమైన వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్.. భీమడోలు రైల్వే గేటు వద్దకు చేరుకుంటుంది.. అయితే, రైలు వస్తున్న సమయంలో గేటును ఢీకొని పట్టాలపైకి వచ్చి ఆగిపోయింది బొలెరో వాహనం.. దీంతో.. దురంతో ఎక్స్‌ప్రెస్ వచ్చి ఆ వాహనాన్ని ఢీకొట్టింది.. ఇక, బొలెరో వాహనంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.. కాగా, రైలు పట్టాలపై వాహనం నిలిచిపోవడంతో.. ఆ వాహనాన్ని వదిలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు.. అయితే, ఆ వాహనాన్ని ఢీకొన్ని రైలు మాత్రం అక్కడే నిలిచిపోయింది. ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం జరగగా.. దాదాపు నాలుగు గంటలుగా భీమడోలులోనే నిలిచిపోయింది దురంతో ఎక్స్‌ప్రెస్. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.. రైలు ముందు భాగంలో ఆ వాహనం విడి భాగాలు ఇరుక్కుపోవడంతో.. రైలు నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Ajay Banga: ప్రపంచ బ్యాంకు చీఫ్‌గా భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఎన్నిక!