ఏపీ సీఎస్ సమీర్ శర్మకు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తన సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పును ఇంకా అమలు చేయడం లేదంటూ ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు. తనను సస్పెండ్ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే తన సస్పెన్షన్ రివోక్ చేయాలని కోరారు. హైకోర్టు ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని.. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మాత్రమే తన సస్పెన్షన్ రివోక్ చేస్తూ…
రెండేళ్లకు పైగా ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం నాడు సచివాలయంలో విధుల్లో చేరారు. ఈ మేరకు జీడీఏలో రిపోర్టు చేశారు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను సీఎస్ సమీర్ శర్మను కలవలేదని చెప్పారు. తన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అసంపూర్ణంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకే తాను సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ప్రయత్నించానని.. అయితే తనను కలిసేందుకు…