Nandyala Crime: అనుమానం పెనుభూతం..పట్టుకుంటే వదలడం కష్టం. అలానే మద్యం ఆరోగ్యానికే కాదు జీవితానికి కూడా ప్రమాదకరం. ఇది తెలిసి మనిషి మద్యానికి బానిస అవుతున్నాడు. లేని పోనీ అనుమానాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నాడు. మద్యం మత్తులో మనిషి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మృగంలా మారుతున్నాడు. గతంలో మద్యం మత్తులో వ్యక్తులు అత్యాచారలకు, హత్యచారాలకు పాల్పడిన ఘటనలు, అనుమానం తో జీవితాలను నాశనం చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను హత్య చేశారు.
Read also:Relationship: క్లాస్‌మేట్‌తో 14 ఏళ్ల బాలిక రిలేషన్‌షిప్.. తండ్రి ఏం చేశాడంటే..?
వివరాలలోకి వెళ్తే.. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల (మం) గోర్విమాను పల్లె లో దారుణం చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యక్తి తన భార్య ధనలక్ష్మి( 26 ) పైన అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మద్యం తాగి ఇంటికి వచ్చాడు నాగరాజు. ఆసమయంలో ఇంట్లో ఉన్న ధనలక్ష్మి పైన కర్రతో దాడి చేసాడు. ఈ దాడిలో ధనలక్ష్మికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనితో ధనలక్ష్మి లక్ష్మి మరణించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ధనలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.