AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. ప్రతీ రోజూ అసెంబ్లీకి రావడం.. ఏదో విషయంపై చర్చకు పట్టుబట్టడం లేదా సభను అడ్డుకోవడంతో ఈ సస్పెన్లు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ రోజు కూడా 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఒకరోజు పాటు వారిని సస్పెండ్ చేశారు.. విద్యుత్ మీటర్ల అంశంపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి నిరసనకు దిగారు.. దీంతో, టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల, జోగేశ్వర రావు, గద్దె , భవాని, మంతెన రామరాజు, సాంబశివరావు, డోల శ్రీబాల వీరాంజనేయులు స్వామి, గోరెంట్ల, వెలగపూడి, గణ వెంకట రెడ్డిని సస్పెండ్ చేశారు.
Read Also: Minister Peddireddy Ramachandra Reddy: వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. అవి స్మార్ట్ మీటర్లు కాదు..!
ఇక, టీడీపీ ఎమ్మెల్యేలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. సస్పెండ్ చేసుకుని వెళ్లి పోవాలని ముందస్తు ప్రణాళికతోనే టీడీపీ సభ్యులు సభకు వస్తున్నారని విమర్శించారు. ఇదే తంతు కొనసాగిస్తున్నారు. సభలో గొడవ సృష్టించాలని వస్తున్నారు. చంద్రబాబు.. స్పీకర్ పై కాగితాలు వేయండి అని డైరెక్షన్ ఇచ్చి పంపిస్తున్నారు అని ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యులు అప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఇవాళ వచ్చింది 11 మంది టీడీపీ సభ్యులే.. మిగిలిన వాళ్లు ఏమయ్యారో తెలియదు అన్నారు.. ఏది జరిగినా చర్చ జగరకుండా సభను అడ్డుకుంటున్నారని.. వీరి తీరుకు నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను.. మిగిలిన మూడు నాలుగు రోజులైనా సభ జరిగేటట్లు సహకరించండి అంటూ టీడీపీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు మంత్రి అంబటి రాంబాబు.