ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌లోని ప్రభాత్ మార్కెట్‌లో జరిగిన ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. శతాక్షి హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న 55 ఏళ్ల వాచ్‌మెన్ రవీంద్ర భారీ ఇనుప గేటు కింద నలిగి అక్కడికక్కడే మరణించాడు. ఈ భయంకరమైన దృశ్యం షోరూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.