మనసు ఎప్పుడు ఉత్సాహంతో ఉరకలు వేస్తే… వయసుతో పెద్దగా పని ఉండదు. ఏ వయసులోనైనా సరే హ్యాపీగా బతికేయవచ్చు. ఆనందంగా జీవించవచ్చు. దీనిని ఎంతో మంది నిరూపించారు. ఇప్పుడు హర్యానాకు చెందిన ఓ ముసలాయన కూడా నిరూపించాడు. హర్యానాలో హస్నా రాణీగా గుర్తింపు పొందిన డ్యాన్సర్ అక్కడ మంచి పేరు ఉన్నది. ఆమె డ్యాన్స్ ఉన్నది అంటే పండగే పండగ. వేలాది మంది ఆమె డ్యాన్స్ చూసేందుకు తరలివస్తుంటారు. ఇలానే ఓ గ్రామంలో హస్నా రాణి డ్యాన్స్ కార్యక్రమం జరుగుతున్నది. ఆమె డ్యాన్స్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వచ్చారు.
Read: భార్య చిన్ననాటి కలను తీర్చడం కోసం… 200 ఏళ్లనాటి కోటను…
హస్నా రాణి డ్యాన్స్ చేయడం ప్రారంభించగానే, ప్రేక్షకుల్లోనుంచి ఓ ముసలాయన లేచి ఆయనకుడా స్టెప్పులు వేయడం మొదలుపెట్టాడు. మూడు నిమిషాల సేపు ఆ ముసలాయాన చేతులు ఊపుతూ ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. పాత వీడియోనే అయినప్పటికీ మరోసారి ఈవీడియో ట్రెండ్ అవుతున్నది. ముసలాయన తగ్గేది లేదని అంటూ డ్యాన్స్ చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాడు.