భార్య చిన్న‌నాటి క‌ల‌ను తీర్చ‌డం కోసం… 200 ఏళ్ల‌నాటి కోట‌ను…

భార్య క‌ల‌ను నెర‌వేర్చేందుకు ఓ వ్య‌క్తి ఏకంగా రూ. 5 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేశాడు.  నిత్యం బిజినెస్ ప‌నుల్లో బిజీగా ఉండే స్పెయిన్‌కు చెందిన టెర్రి ఎడ్గెల్ అనే వ్య‌క్తి త‌న భార్య‌తో క‌లిసి సెల‌వుల్లో వెకేషన్ కోసం ఓ అంద‌మైన ఇల్లును కొనుగోలు చేయాల‌ని అనుకున్న‌డు.  అయితే, ఆయ‌న భార్యకు కౌబ్రిడ్జ్ వేల్ ఆఫ్ గ్లామోర్గాన్ సమీపంలోని 200 ఏళ్ల‌నాటి కోట లాంటి ఇల్లు అంటే ఇష్ట‌మ‌ని, ఒక్క‌సారైనా ఆ ఇంట్లో నివశించాల‌ని అనుకుంది.  ఓ సంద‌ర్భంలో భ‌ర్త‌కు ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది.  భార్య చెప్పిన విష‌యాన్ని మ‌ర్చిపోకుండా గుర్తుపెట్టుకున్న ఆ భ‌ర్త, ఆ కోట‌ను రూ. 5 కోట్ల‌కు కొనుగోలు చేశాడు.  దానికి సంబంధించిన ప‌త్రాల‌ను తీసుకొని ఇంటికి వెళ్లాడు.  

Read: బూస్టర్ డోస్ అదేనా? మిక్స్ అండ్ మ్యాచ్ వద్దా?

భార్య‌కు స‌ర్ప్రైజ్ ఉంద‌ని, చెప్ప‌డంతో మొద‌ట ఆమె భ‌య‌ప‌డింది.  ఎక్క‌డ విడాకులు అడుగుతాడో అని ఆందోళ‌న చెందింది.  కానీ, స‌ర్ప్రైజ్ అంటూ ఆమె చేతిలో రూ.5 కోట్ల రూపాయ‌ల విలువైన కోట‌ను పెట్టాడు.  దాన్ని చూసి ఆ భార్య నిజంగానే స‌ర్ప్రైజ్ అయింది.  చిన్ననాటి క‌ల‌ను ఆ భ‌ర్త నెర‌వేర్చిన విధానం చూసి షాక్ అయింది.  ఆ కోట‌ను వేలంలో రూ. 5 కోట్ల‌కు కోనుగోలు చేశాడ‌ట‌.  ఇప్పుడు ఆ భార్య ఆ ఇంటిని కావాల్సిన విధంగా మార్పులు చేయించుకునే ప‌నిలో ఉన్న‌ది. 

Related Articles

Latest Articles