అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వస్తుందో ఎవరికీ చెప్పలేం. సముద్రాన్ని నమ్ముకొని చేపల వేటను సాగించే మత్స్యకారులకు అప్పుడప్పుడు ఆ చేపల రూపంలోనే అదృష్టం వరిస్తుంటుంది. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతని వలకు 30 కేజీల కచ్చిడి మగచేప ఒకటి దొరికింది. ఈ చేపను ఒడ్డుకు తీసుకొచ్చి వేలం వేశారు. ఈ వేలంలో ఈ చేపను రూ. 4.30 లక్షలకు అమ్ముడుపోయింది. ఎంతపెద్దవైనా మామూలు చేపలకు ఇంత గిరాకి ఉండదు. కానీ, కచ్చిడి చేపల్లో ఉండే బ్లాడర్ ఔషదగుణాలు కలిగి ఉంటుంది. దీనిని అనేక మెడిసిన్స్‌లో వినియోగిస్తారు. దీంతో ఈ చేపను పెద్ద మొత్తంలో చెల్లించి వ్యాపారులు సొంతం చేసుకున్నారు. కచ్చిడి చేపకు ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి అని మత్స్యకారులు చెబుతున్నారు. కచ్చిడి చేపలను వైన్ తయారు చేసేందుకు కూడా వినియోగిస్తారు. అంతేకాదు, ఈ చేప పొట్టభాగాన్ని బలానికి వాడే మందుల కోసం వినియోగిస్తారు.
Read: భారత్‌లో మరో కొత్త కల్చర్… ఇకపై వారానికొకసారి…