Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆనందం కోసం డ్యాన్స్ చేయడం చిన్నపిల్లలు మాత్రమే చేసే పని అనుకుంటే పొరపాటే.. ఆనందంలో చిందులు వేయడానికి వయసుకు సంబంధం లేదు. ఎవరైనా ఆనందంలో డ్యాన్స్ చేయవచ్చు.. చిందులు వేయవచ్చు.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆశా భోంస్లే పాడిన పియా తు ఆబ్ తో ఆజా అనే ఐకానిక్ పాటకు ఓ వృద్ధురాలు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌భయానీ పేజీ షేర్ చేసింది. ఇప్పటివరకు లక్షకు పైగా వీక్షణలను పొందింది.
ఈ వీడియోలో బామ్మా అలిసిపోకుండా క్రేజీ స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ముఖంపై చిరునవ్వుతో, ఆమె హృదయపూర్వకంగా నృత్యం చేసింది మరియు అతిథులు తన చుట్టూ చేరి ఆమెను ఉత్సాహపరుస్తుండగా ఆకట్టుకుంది. క్లిప్‌లో అనేక మంది మహిళలు ఆమె చీర్స్‌కు నృత్యం చేయడం కూడా కలిగి ఉంది. బామ్మ పిచ్చి డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వ్యాఖ్యల విభాగం ప్రేమ మరియు హృదయ ఎమోజీలతో నిండిపోయింది. ఈ పాటను RD బర్మన్ కంపోజ్ చేసారు మరియు లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే పాడారు. అప్పట్లోనే ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ వేసుకుని ఓలేడీ పార్టీలో బామ్మ స్టెప్పులతో అదరగొట్టడం అందరిని ఆకట్టుకుంటోంది. అక్కడ అంత మంది లేడీస్ కూర్చున్న కానీ.. బామ్మ మాత్రం లేచి డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్ బామ్మ మీరు సూపర్ అంటూ నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. ఈ వయస్సులో అస్సలు అలిసి పోకుండా డ్యాన్స్ చేయడం యువతకి మీరు స్పూర్తి అంటూ మరో నెటిజన్ కమెంట్ చేశాడు.