Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆనందం కోసం డ్యాన్స్ చేయడం చిన్నపిల్లలు మాత్రమే చేసే పని అనుకుంటే పొరపాటే.. ఆనందంలో చిందులు వేయడానికి వయసుకు సంబంధం లేదు.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అనారోగ్యంతో భాదపడుతున్న విషయం తెల్సిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్క ఆరోగ్య విషయమై చెల్లి ఆశా…
(సెప్టెంబర్ 8న ఆశా భోస్లే పుట్టినరోజు) ఒక కొమ్మకు పూచిన పూలన్నీ పూజకు పనికిరావు అనే సామెత ఉంది. పుణ్యం చేసుకున్న పూలే పూజలో చోటు సంపాదిస్తాయి అంటారు. ఒకే తల్లి పిల్లల్లో అందరూ ఒకేలా ఉండక పోవచ్చు, కానీ కొందరు తమ కళలకు సానపట్టుకొని వెలుగులు విరజిమ్ముతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రఖ్యాత గాయనీమణులు లతా మంగేష్కర్, ఆమె చెల్లెలు ఆశా భోస్లే ఉన్నారని చెప్పవచ్చు. ఇద్దరూ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ చూపిన బాటలో సంగీతసాధనతోనే…
నోరు జారితే ఎంతటి వారికైనా కష్టమే! అదీ మనకంటే ఎంతో గొప్పవారి గురించి నోరు జారితే… అది మరింత కష్టం! ఓ సారి హిమేశ్ రేషిమియాకు అదే జరిగింది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అనూహ్యమైన క్రేజ్ ఏర్పడింది. ఆయన పాటలంటే యూత్ చెవి కోసుకునే వారు. కానీ, అదే సమయంలో కొందరు మాత్రం ముక్కుతో పాడేస్తున్నాడని ముక్కోపం ప్రదర్శించేవారు. అయితే, చాలాసార్లు ఓపిక పట్టిన హిమేశ్ ఒకసారి మాత్రం మీడియా వారి…