మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఢిల్లీ మెట్రోకు చెందిన వీడియోలైతే.. తరచూ చర్చలో ఉంటాయి. ఇటీవల వైరల్ అయిన వీడియోలో.. ఒక అమ్మాయి చిరిగిన దుస్తులతో మెట్రోలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇప్పుడు మరో మెట్రోకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియో ఢిల్లీ మెట్రోకు సంబంధించింది కాదు.
READ MORE: Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు ‘శిల్పా’ బ్యానర్ ఆటలు!
వైరల్ అయిన వీడియోలో.. నలుగురు అమ్మాయిలు మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. ఈ అమ్మాయిల డ్రెస్సింగ్ అందరినీ అశ్చర్య పరిచింది. ఎందుకంటే ఈ వీడియోలు వీరు ఎలాంటి డ్రెస్ వేసుకోలేదు. కేవలం తెల్లటి మందపాటి టవల్స్ మాత్రమే చుట్టుకున్నారు. అలాగే వాళ్లు మెట్రోలోకి ప్రవేశించారు. వీళ్లను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయిలను వీడియో తీస్తున్న కెమెరా మ్యాన్ మెట్రోలో వీరి చేష్టలను గమనిస్తున్న ప్రయాణికులను కూడా క్యాప్చర్ చేశారు.
READ MORE:white hair : 30 ఏళ్ల వయసులోనే జుట్టు నెరిసిపోతుందా? కారణం ఏంటో తెలుసుకోండి ?
అయితే.. వీరిని చూసిన కొందరు అసహ్యించుకున్నారు. వీళ్లతో కొందరు సెల్ఫీలు సైతం దిగారు. మెట్రో హల్‌చల్ చేసిన ఈ యువకులను ప్రయాణికులు, వృద్ధులు, యువకులు అందరూ తమ మొబైల్ ఫోన్లులో ఫొటోలు, వీడియోలు తీయడం ప్రారంభించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అమ్మాయిలు కూడా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ వీడియో @mimisskate అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. దీన్ని ఇప్పటివరకు కొన్ని లక్షలకు పైగా వీక్షించారు. వేల మంది దీన్ని లైక్ చేసి షేర్ చేశారు. వీడియోపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘ఈ ఆడవాళ్ళు బాత్‌రూమ్‌లోంచి నేరుగా మెట్రోకి వచ్చినట్లుంది’ అని ఓ వినియోగదారు కామెంట్ చేశారు. కాగా.. ఈ వీడియో విదేశీ మహిళలలకు చెందినది. ఈ మెట్రో ఏ దేశానికి చెందిందో స్పష్టత లేదు.