మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఢిల్లీ మెట్రోకు చెందిన వీడియోలైతే.. తరచూ చర్చలో ఉంటాయి. ఇటీవల వైరల్ అయిన వీడియోలో.. ఒక అమ్మాయి చిరిగిన దుస్తులతో మెట్రోలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇప్పుడు మరో మెట్రోకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియో ఢిల్లీ మెట్రోకు సంబంధించింది కాదు.