తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై, అప్పు తీర్చలేక ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మెదక్ రామాయంపేట మండలం ప్రగతిధర్మారంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఈ గ్రామానికి చెందిన భాను ప్రకాష్ ధాన్యం అమ్ముగ వోచిన డబ్బుతో ఆన్ లైన్ లో బెట్టింగ్ వేసాడు మరోవైపు బుకీలు కూడా బెట్టింగ్ నగదు చెల్లించాలంటూ వేధిచడంతో ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక దీంతో మనస్తాపానికి గురైన భాను ప్రకాష్ ఈ నెల 13న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.