లంకకు వెళ్లే టీంఇండియాకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 18-22 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఆ తర్వాత అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. కానీ ఈ మధయ్లో జులైలో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతేడాది కరోనా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది. అయితే టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు వెళ్లిన ఆటగాళ్లతో కాకుండా మిగిలిన సీనియర్ ఆటగాళ్లతో ఓ జట్టును చేసి శ్రీలంకకు పంపనుంది బీసీసీఐ. దాంతో లంక వెళ్లే జట్టుకి టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు అని తెలుస్తుంది. లంక టూర్‌కి కోచ్‌గా వ్యవహరించమని బీసీసీఐ ద్రవిడ్‌ని కోరినట్లు… అయితే దానికి ద్రవిడ్‌తో పాటు ఎన్‌సీఏలోని సపోర్ట్ స్టాఫ్ కూడా అంగీకరించినట్లు సమాచారం. చూడాలి మరి దీని పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!