ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఇంద్రవెల్లి ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా ఇంకా ఇక్కడి గిరిజనులు హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ గిరిజనుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల సాయం ప్రకటించాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. గిరిజన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రభుత్వం తక్షణం పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలి అని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల అభివృద్ధి కోసం పని చేస్తున్న ఐటిడిఏలు నిర్వీర్యం చేయడం జరిగింది. గిరిజనుల సమస్యలపై పార్లమెంట్‌లో మాట్లాడుతా అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే కొమురం భీమ్ స్పూర్తితో ప్రత్యేక కార్యచరణతో ఉద్యమం చేపడుతాం అని పేర్కొన్నారు.