భూమిపై ఎన్నో వింతు విడ్డూరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు. వింతలూ, విశేషాలు కామన్. అయితే, కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఔరా అనిపించే విధంగా ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు. ఇలాంటి వింతైన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా హరియావా గ్రామంలోని శారదానది ఉన్నట్టుండి గుడ్లనదిలా మారిపోయింది. వేలాది గుడ్లు నదిలో తేలాడుతూ కనిపించాయి. దీంతో హరియావా గ్రామస్తులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా నదిలో గుడ్లు కనిపించడంతో వాటిని పట్టుకోవడానికి ప్రజలు పోటీపడ్డారు. దీనికి సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read: సూరి బాబు గాడి శ్రీదేవి రాబోతోంది !