సూరి బాబు గాడి శ్రీదేవి రాబోతోంది !

యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్‌”. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, సత్యం రాజేష్, నరేష్, రఘుబాబు, అజయ్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి సహాయక పాత్రలు పోషిస్తున్నారు. సమాచారం ప్రకారం సుధీర్ బాబు నటించిన ఈ వైవిధ్యమైన చిత్రం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను జీ కొనుగోలు చేసింది. ఇందులో సుధీర్ బాబు సరసన ఆనంది కథానాయికగా నటించింది. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.

Read Also : మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ చేతులు మారుతోందా!?

తాజాగా మేకర్స్ సినిమా నుంచి ఓ అప్డేట్ ను ఇచ్చారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు “సూరిగాడు” అనే లైటింగ్ బాయ్ గా కనిపించబోతున్నాడు. ఆయన ప్రేయసి ‘శ్రీదేవి’ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే సూరిబాబును పరిచయం చేసిన మేకర్స్ ఇప్పుడు శ్రీదేవిని కూడా పరిచయం చేయబోతున్నట్టు ప్రకటించారు. శ్రీదేవి ఇంట్రో టీజర్ జూలై 30న ఉదయం 10 గంటలకు రిలీజ్ కానుంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-