అద్దెకు తల్లిదండ్రులు దొరుకుతుండటంతో పిల్లలను చూసుకునేందుకు ఆ దేశంలోని పేరేంట్స్ చిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఉద్యోగాలు చేసుకునే వారికి పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు అప్పగించి, వాళ్లు చిల్ అవుతున్నారు.
Read Also: iPhone 15 Launch 2023: సెప్టెంబర్ 5న ఐఫోన్ 15 లాంచ్.. అదనంగా 5 ఫీచర్లు! యాపిల్ లవర్స్‌కు పండగే
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టును అనుసరించి చైనాలోని ఒక బాత్‌హౌస్ అద్దెకు తండ్రులను అందించే సేవలను స్టార్ట్ చేసింది. చైనాలో బాత్ హౌస్‌లు ఎంతో ఆదరణ పొందుతుంటాయి. జనం రిలాక్స్ అయ్యేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ బాత్‌హౌస్‌లకు పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు. ఇక్కడ పురుషులకు, మహిళలకు వేర్వేరుగా సెక్షన్లు ఉన్నాయి. అయితే ఇక్కడికు వచ్చే కొందరు మహిళలు తమ చిన్నపిల్లలను తీసుకుని స్నానం చేయించేందుకు.. మసాజ్ చేయించుకునేందుకు వస్తుంటారు. వీరి ఇళ్లలో పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతోనే వారు పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తారు.
Read Also: Rahul Gandhi: ‘మోడీ ఇంటిపేరు’ విషయంలో నేడు కోర్టుకు రాహుల్ గాంధీ
అయితే పిల్లలను పక్కనే ఉంచుకుని స్నానం చేయడం, మసాజ్ చేయించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ సమయంలో తమ పిల్లలను పట్టుకోలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతారు. అలాంటి మహిళల ఇబ్బందులను గ్రహించిన ఒక బాత్‌హౌస్ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలను స్టార్ట్ చేసింది. మహిళలు బాత్‌హౌస్‌కు వచ్చినప్పుడు వారి పిల్లలను ఈ అద్దె డాడీలు చూసుకుంటారు. అప్పుడు ఆ చిన్నారుల మమ్మీలు హాయిగా చిల్ అవుతారు. ఈ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు నెట్టింట చర్చాంశనీయంగా మారింది.
Read Also: India And Taiwan: ఇండియాకు సెమీకండక్టర్ పరిశ్రమ.. చైనా నుంచి తరలనున్న తైవాన్ కంపెనీ
ఈ సేవలు పొందెందుకు వచ్చిన తల్లులతో పాటు పిల్లలను అద్దె డాడీలు చూసుకుంటారు. వారికి స్నానాలు చేయించడంతో పాటు దుస్తులు మార్పించడం, అన్నం తినిపించడం లాంటి సేవలను వాళ్లు చూసుకుంటారు. ఇటీవలనే ఈ సేవలను ఆరంభించిన బాత్‌హౌస్ అద్దె డాడీలుగా నియమితులయ్యేవారికి శిక్షణ ఇస్తోంది. అలాగే ఈ సేవలకు సంబంధించిన గైడ్‌లైన్స్ రూపొందించింది.