ఈ ఏడాదిలో ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చిన అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. అటువంటి సినిమాలలో 12th ఫెయిల్ ఒకటి. మనోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఎంతో హృద్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు… ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్ సూపర్ హిట్‌గా నిలిచింది.
కేవలం మౌత్ టాక్ తోనే భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈసినిమా ఏకంగా 70 కోట్లకు పైగా వసూళ్లు చెయ్యడం విశేషం.. విద్యావ్యవస్థలో ఉన్న లోటు పాట్లును చూపించే విధంగా ఈ సినిమా కథ ఉంటుంది.. విద్యార్థులు, తల్లిదండ్రుల మనసుల్ని కదిలించేలా తెరకెక్కిన ఈ బయోపిక్ మూవీ ఆడియెన్స్‌ను బాగా అలరించింది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన 12th ఫెయిల్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.. ఈ సినిమాను ప్రముఖ ఓటీటి సంస్థ జీ5 లో రానుంది.. ఈ బయోపిక్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. జనవరి 5న తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 12th ఫెయిల్ మూవీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది.
ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది… 12వ తరగతిలో ఫెయిల్ అయిన అతను పొట్ట కూటి కోసం ఆటో డ్రైవర్‌గా మారుతాడు. అయితే తన కలల ప్రయాణాన్ని మాత్రం వదులు కోడు. చివరకు ఆ ఆటో డ్రైవర్ ఐపీఎస్‌గా ఎలా సెలెక్డ్ అయ్యాడన్నది 12th ఫెయిల్ మూవీలో ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా చూపించారు… మొత్తానికి ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది.. ఇక్కడ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..