పాస్తా ప్రపంచంలో అత్యంత ఇష్టపడే ఇటాలియన్ వంటలలో ఒకటి. వివిధ ఆకారాలు పరిమాణాలలో వస్తుంది. ఫ్యూసిల్లి నుండి స్పఘెట్టి వరకు దీనిని వివిధ రకాల సాస్‌లలో వండవచ్చు.. టేస్ట్ అట్లాస్, సాంప్రదాయక ఆహారం కోసం అనుభవపూర్వకమైన ట్రావెల్ ఆన్‌లైన్ గైడ్ ప్రపంచంలో అత్యుత్తమ రేటింగ్ పొందిన పాస్తా వంటకాల జాబితాను విడుదల చేసింది.పప్పర్డెల్లె అల్ సింఘియేల్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది, తరువాత పాస్తా కార్బోనారా, టాగ్లియాటెల్లె అల్ రాగు అల్లా బోలోగ్నీస్ వరుసగా రెండవ, మూడవ స్థానాలను ఆక్రమించాయి.
పప్పర్డెల్లా అల్ సింగ్‌హియేల్‌ను వర్ణిస్తూ, టేస్ట్ అట్లాస్ పప్పర్డెల్లా ఒక ప్రసిద్ధ టుస్కాన్ పాస్తా రకం, ఇది రాగు డి సింఘియేల్ (అడవి పందితో తయారు చేయబడింది)తో జత చేయబడింది. ఇది ఈ ప్రాంతంలోని ఉత్తమ గ్యాస్ట్రోనమిక్ అనుభవాలలో ఒకటిగా నిలిచింది. ‘క్లాసిక్ రాగులా కాకుండా, అడవి పందితో తయారుచేయబడినది.. టొమాటోలు, అలాగే రెడ్ వైన్‌తో కూడిన రిచ్ సాస్‌లో సుదీర్ఘమైన, నెమ్మదిగా ఉడకబెట్టడం ద్వారా తీవ్రమైన, చాలా బలమైన రుచిని కలిగి ఉంటుంది’ అని అది పేర్కొంది… మొత్తంగా ప్రపంచం కెల్లా పాస్తా అత్యంత పాపులారిటిని సంపాదించుకుంది..
ప్రపంచంలోని టాప్-టెన్ పాస్తా వంటకాలను చూడండి:
1. పప్పర్డెల్లె అల్ సింగ్హియేల్- టుస్కానీ, ఇటలీ
2. పాస్తా కార్బోనారా- రోమ్, ఇటలీ
3. టాగ్లియాటెల్లె అల్ రాగు అల్లా బోలోగ్నీస్- బోలోగ్నా, ఇటలీ
4. లాసాగ్నే అల్లా బోలోగ్నీస్- బోలోగ్నా ఇటలీ
5. లింగ్విన్ అల్లో స్కోగ్లియో- కాంపానియా, ఇటలీ
6. పాస్తా ఆల్ గ్రిసియా- గ్రిస్సియానో, ఇటలీ
7. గియోవెట్సీ- గ్రీస్
8. కులర్జియోనిస్ డి’ఓగ్లియాస్ట్రా- ప్రావిన్స్ ఆఫ్ నూరో, ఇటలీ
9. బిగోలి కాన్ ఎల్’అనట్రా- విసెంజ్ ప్రావిన్స్, ఇటలీ
10. రావియోలీ- ఇటలీ..