Vulture Population: మానవుల అకాల మరణాలకు, భారతదేశంలో క్షీణిస్తున్న ‘రాబందుల’ జనాభాకు సంబంధం ఉందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ పర్యావరణ విపత్తు ఫలితంగా 2000 నుంచి 2005 వరకు అర మిలియన్ మంది మానవులు అకాల మరణం చెందినట్లు తెలిపింది. పర్యావరణ వ్యవస్థలో ఈ కీలకమైన స్కావెంజర్లు లేకపోవడం వల్ల ఏర్పడిన ప్రజారోగ్య సంక్షోభం, జీవవైవిధ్యం మరియు మానవ ఆరోగ్యం మధ్య ఉండాల్సిన సున్నితమైన సమతుల్యతపై ప్రభావం చూపినట్లుగా చెప్పింది.
అమెరికన్ ఎకనామిక్ రివ్యూలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. ప్రజారోగ్య సంక్షోభం వల్ల ఏటా దాదాపుగా 70 బిలియన్ల ద్రవ్య నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. ఈ ఫలితాలు రాబందుల వంటి కీలకమైన జాతుల్ని సంరక్షించాల్సిన బాధ్యతను సూచిస్తోంది. రాబందులు ఇండియాలో కీలమైన జాతి, దేశంలోని అనేక పర్యావరణ వ్యవస్థల పనితీరుకు చాలా అవసరమైనవి అని అధ్యయనం చెప్పింది.
Read Also: Tamil Nadu: తమిళనాడులో ఆరుగురు రష్యా పౌరులు అరెస్ట్..
రాబందులు కేవలం వ్యాధుల బారిన పడిన మృతదేహాలు శుభ్రం చేయడమే కాకుండా, ఆహారాన్ని తీసివేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తాయి. ఉదాహరణకు రాబిస్‌తో చనిపోయిన కుక్కల ద్వారా ఇతరుకు ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా రాబందులు రక్షిస్తాయి. ఇదే కాకుండా రాబందులు లేకుంటే, రైతులు చనిపోయిన తమ పశువులను నీటి మార్గాల్లో పారేస్తారు, ఇది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుందని స్టడీ చెప్పింది.
1994లో రైతులు తమ పశువులు, ఇతర జంతువులకు నొప్పి, వాపు తగ్గేందుకు ‘డైక్లోఫెనాక్’ అనే మందు ఇవ్వడం ప్రారంభించారు. అయితే, ఈ డ్రగ్ తీసుకున్న జంతువుల కళేబరాలను తిన్న తర్వాత రాబందులకు విపరీత ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. వాటి మూత్రపిండాలు నాశనమయ్యాయి. కేవలం ఒక దశాబ్ధంలోనే రాబందుల జనాభా 50 మిలియన్ల నుంచి కేవలం వేలకు పడిపోయింది.