Pawan Kalyan Anasuya Special Song News Viral: న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారిన అనసూయ తర్వాత నటిగా కూడా మారింది. ఇప్పుడు పూర్తిగా యాంకరింగ్ కి గుడ్ బాయ్ చెప్పి ఒకపక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే ప్రోగ్రాం స్టార్ మా లో ప్రసారమవుతోంది. ప్రతి శనివారం ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న ఈ షో కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో అనసూయ తను పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సాంగ్ చేసిన విషయం బయట పెట్టింది. ఈ షోలో భాగంగా స్టార్ల చిన్నప్పటి ఫోటోలు పెట్టి వారు ఎవరో గుర్తుపట్టాల్సిందిగా ఒక చిన్న కాంటెస్ట్ పెడితే చిన్నప్పటి పవన్ కళ్యాణ్ ఫోటోని అందరూ ఈజీగా గుర్తుపట్టారు.
Vijay Deverakonda Leaks: మీ ఆత్రుత అర్ధమైంది.. ఆగండ్రా బాబూ!
ఈ సందర్భంగా అనసూయ పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుభవాన్ని పంచుకుంది. తాను ఇప్పటివరకు ఈ విషయం బయట ఎక్కడా రివీల్ చేయలేదని, పవన్ కళ్యాణ్ తో తానూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఆ సాంగ్ టీవీలో మారుమోగిపోతుందని ఆమె పేర్కొంది. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఆమె ఏ సినిమాలో సాంగ్ చేసింది అనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పవన్ హీరోగా హరిహర వీరమల్లు, ఓజి, భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్స్ అయితే జరగడం లేదు.