ఇండియలో అది అత్యంత అరుదైన ఇల్లు. అలాంటి ఇంటిని దేశంలో మరెక్కడా చూసి ఉండరు. ఆ ఇంటి చుట్టూ రెండు దేశాల సైనికులు పహారా కాస్తుంటారు. ఇది అధికారుల అధికారిక నివాసం కాదు. సామాన్యులు నివసించే ఇల్లే. కానీ, ఈ ఇంటికి చాలా చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. తూర్పుపాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత ఇండియా.. బంగ్లాదేశ్ మధ్య ఖచ్చితమైన సరిహద్దు ఉన్నది. వేల కిలోమీటర్లమేర సరిహద్దు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో రెండు దేశాల మద్య పెన్సింగ్ లేదు. పరస్పర అవగాహన, ఒప్పందంతో ఇరుదేశాల సైనికులు పహారా కాస్తుంటారు. అలా రెండు దేశాలకు సరిహద్దులో ఈ ఇల్లు ఉన్నది.
Read: అనుకోకుండా జరిగిన ఆ సంఘటనే… టీగా మారిందా…
ఈ ఇంటి మద్యనుంచి రెండు దేశాల సరిహద్దు ఉన్నది. ఈ ఇంట్లో సగభాగం ఇండియావైపు ఉంటే, మరోవైపు బంగ్లాదేశ్‌వైపు ఉంటుంది. రెండు దేశాల ప్రజలు ఈ ఇంట్లో నివశిస్తున్నారు. వారిమధ్య ఇండియా బంగ్లాదేశ్ భావన ఉండదట. కలిసిమెలిసి నివశిస్తున్నారు. అయితే ఇంటి నుంచి బయటకు వస్తే రెండు వైపులా రెండు దేశాల సైనికులు నిత్యం పహారా కాస్తుంటారు. ఈ ఇల్లు బెంగాల్‌లోని హరిపుకర్ సరిహద్దుల్లో ఉన్నది. పాక్ సరిహద్దుల్లో ఉన్నట్టుగా ఎలాంటి టెన్షన్ వాతావరణం ఇక్కడ కనిపించదు.