E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
- ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల
- 165 కిలోమీటర్ల వరకు రేంజ్
- E3 ట్రయాన్ ప్రారంభ ధర రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E3 Tryon: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కంపెనీలు, స్టార్టప్‌లు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన స్టార్టప్ E3 తన కొత్త ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు AI ఆధారిత సాంకేతికత, రెండు బ్యాటరీ ఆప్షన్లు, 165 కిలోమీటర్ల వరకు రేంజ్ వంటి ఫీచర్లను ఈ స్కూటర్లో అందించారు. మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన E3 ట్రయాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.
E3 ట్రయాన్ అధికారికంగా విడుదల
E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేశారు. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి ఈ స్కూటర్‌తో అడుగుపెట్టింది. స్కూటర్లో AI టెక్నాలజీని ఉపయోగించడం దీని ప్రత్యేకతల్లో ఒకటి. బ్యాటరీ, మోటార్‌తో పాటు రహదారి పరిస్థితులను పర్యవేక్షించడంలో ఈ సాంకేతికత సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది.
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
రెండు బ్యాటరీ ఆప్షన్లు
E3 ట్రయాన్‌లో 2.3 kWh, 3 kWh LFP బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
2.3 kWh బ్యాటరీ: రిమూవబుల్ బ్యాటరీ
3 kWh బ్యాటరీ: ఫిక్స్డ్ బ్యాటరీ
గరిష్ఠ రేంజ్: 165 కి.మీ వరకు
ఫాస్ట్ ఛార్జింగ్: 10 నిమిషాల ఛార్జింగ్‌తో 10 కి.మీ వరకు రేంజ్ పొందే అవకాశం. అయితే వాస్తవ రేంజ్ రైడింగ్ పరిస్థితులు, వేగం, రోడ్డు పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు.
ఫీచర్లు అదిరిపోయేలా..
E3 ట్రయాన్‌లో అనేక ఆధునిక ఫీచర్లను అందించారు. ఇందులో 5-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. అదనంగా మరో స్క్రీన్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఇతర ముఖ్యమైన ఫీచర్లు:
LED లైటింగ్
సింగిల్ సీట్
ఫ్లాట్ ఫుట్‌బోర్డ్
క్రూయిజ్ కంట్రోల్
ఫార్వర్డ్ పార్కింగ్ మోడ్
రివర్స్ పార్కింగ్ మోడ్
Eco రైడింగ్ మోడ్
Power రైడింగ్ మోడ్
Sport రైడింగ్ మోడ్
AI ఆధారిత సాంకేతికత
100కు పైగా ఇతర ఫీచర్లు
E3 ట్రయాన్ ధర ఎంత?
కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది.
వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర
బేస్ వేరియంట్ రూ.1.00 లక్ష
మిడ్-స్పెక్ వేరియంట్ రూ.1.10 లక్షలు
టాప్-స్పెక్ వేరియంట్ రూ.1.20 లక్షలు
అంటే E3 ట్రయాన్ ప్రారంభ ధర రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కంపెనీ ప్రకారం స్కూటర్ డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు